ఆక్లాండ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టీ20 లో కెప్టెన్ కోహ్లికి తృటిలో ప్రమాదం తప్పింది. ఇక ముందుగా టాస్ గెలిచి ఇండియా ఫీల్డింగ్ తీసుకోగా కివీస్ నిర్ణీత 20ఓవర్స్ కి 200పైగా పరుగులు చేసింది. భారత్ బౌలర్స్ కి చుక్కలు చూపించారు. అనంతరం చేసింగ్ కి వచ్చిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ రూపంలో వికెట్ కోల్పోయింది. ఆ తరువాత కోహ్లి, రాహుల్ అద్భుతంగా రాణించారు. ఆ తరువాత రాహుల్, కోహ్లి, దుబే వరుసగా అవుట్ అవ్వడంతో భారత్ కష్టాల్లో పడింది. కాని ఐయ్యర్ చివర్లో చుక్కలు చూపించాడు. దాంతో మ్యాచ్ భారత్ వసం అయ్యింది.