రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసిబి దాడులు జరగడం అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న 670 పైగా ఎమ్మార్వో కార్యాలయాలలో ఎంచుకుని 250 ఎమ్మార్వో కార్యాలయంలో ఒకేసారి నేడు దాడులు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఏసీబీ రివ్యూ లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏసీబీ పై విమర్శలు చేశారు. అవినీతిని అదుపు చేయాలని,అవినీతి ని అరికట్టాలని పేదవారికి సత్వర న్యాయం అందాలనే ఉద్దేశ్యంతో ఏసీబీ అధికారులకు గట్టిగా చెప్పారు..ఈ క్రమంలో మీకోసంలొ వచ్చిన అర్జీలు భూ రికార్డులు, పాస్ పుస్తకాలు, వంటివాటిని ఎంతవరకు నిర్వహిస్తున్నారు.అనే దాని పై ఏసీబీ అధికారులు చాలా చోట్ల తనిఖీలు చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
