యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సరికొత్త మూవీలో నటిస్తున్న సంగతి విదితమే.
ఈ మూవీ గురించి ఒక వార్త ఇటు సోషల్ మీడియాలో అటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకప్పుడు తన అందాలతో.. చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న భాగ్యశ్రీ ప్రభాస్ కు తల్లిగా నటించనున్నది ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే చిత్రం యూనిట్ భాగ్యశ్రీని సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం యొక్క షూటింగ్ మొదలయింది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్రయత్నం చేస్తుంది.