టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ శాసనమండలిలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లును జగన్ సర్కార్ శాసనమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ‌్య వాడీవేడీ చర్చజరిగింది. ఏపీ వికేంద్రీరణ బిల్లుపై రూల్ 71 కింద చర్చించడానికి తెలుగుదేశం పార్టీ సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చ అది. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉండడంతో ఆ పార్టీ సభ్యులు దూకుడుగా వ్యవహరించారు. ఎట్టిపరిస్థితుల్లో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న టీడీపీ వ్యూహం ఫలించింది. చంద్రబాబు స్వయంగా గ్యాలరీలో కూర్చుని టీడీపీ ఎమ్మెల్సీ, స్పీకర్ షరీఫ్‌కు సైగ్ చేస్తూ రాజకీయం నడిపించారు. మండలి స్పీకర్ షరీష్ తప్పు చేస్తున్నా అంటూనే…తనకున్న విచక్షణాఅధికారం ప్రకారం రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించారు.
మండలిలో టీడీపీ అనుసరించిన తీరు పట్ల వైసీపీ మంత్రులు బొత్స, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పెద్దిరెడ్డి తదితరులు తీవ్ర అభ్యంతరం చెబుతూ స్పీకర్ పోడియం వైపు దూసుకువెళ్లారు. ఇలా శాసనమండలిలో వాడివేడిగా చర్చ కొనసాగుతున్న సమయంలో..లోకేష్ తన సెల్‌ఫోన్‌తో స్పీకర్ పోడియంలో ప్రశ్నిస్తున్న వైసీపీ మంత్రులను షూట్ చేశారు.లోకేష్ తన సెల్‌ఫోన్‌తో కౌన్సిల్ సమావేశాలను షూట్ చేయడాన్ని వైసీపీ సభ్యులు తప్పుపట్టారు. ఈ విషయాన్ని స్పీకర్ షరీఫ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో షరీఫ్ మందలించడంతో లోకేష్ షూటింగ్ చేయడం బంద్‌చేసి తన సీట్లో కూర్చున్నారు. కాగా అప్పటికప్పుడు ఈ వివాదం కాస్తా సద్దుమణిగినప్పటికీ.. లొకేష్ శాసనమండలి సమావేశాలను షూట్‌చేయడంపై ప్రభుత్వం సీరీయస్ అయింది. ఈ మేరకు లోకేష్ నిబంధనలను ఉల్లంఘింస్తూ తన మొబైల్‌తో కౌన్సిల్ సమావేశాలను షూట్ చేశారని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయబోతోంది. లోకేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే లోకేష్ ఎమ్మెల్సీ పదవిపై అనర్హత వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా సెల్‌ఫోన్‌తో కౌన్సిల్ సమావేశాలను షూట్ చేసి….నారా లోకేష్ తన ఎమెల్సీ పదవికి తానే ఎసరు పెట్టకున్నాడు. మరి లోకేష్ పదవి ఉంటుందో..వూస్టింగ్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం లోకేష్ కౌన్సిల్‌లో తన సెల్‌ఫోన్‌తో షూట్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
మండలిలో నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ తో వీడియో షూట్….
మండలిలో నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ తో వీడియో షూట్….లోకేష్ ఎమ్మెల్సీ పదవి వూస్టింగ్…?
Publiée par Dharuvu sur Mercredi 22 janvier 2020