దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక మంత్రి కేటీ రామారావు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF20) సదస్సులో పాల్గొన్నారు.
పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఆల్ఫాబెట్ ఇంక్ కంపెనీతో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ తో సమావేశమయ్యారు.
రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన గూగుల్ సంస్థ పనితీరుతో పాటు సంస్థ అభివృద్ధి,పెట్టుబడులు తదితర పలు అంశాలపై చర్చించారు. వీరితో పాటుగా కేపీజీఎం,బీఏఈ సిస్టమ్స్ అధినేతలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.