ఫిబ్రవరి రెండో తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రకాశం బ్యారేజ్ వద్దగల సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు భారీ కవాతు నిర్వహించాలని బి.జె.పి., జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్ణయించాయి. అయిదు కోట్ల మంది ఆంధ్రుల శ్రేయస్సు కోసం సుక్షేత్రాలైన భూములను త్యాగం చేసిన రైతులకు భరోసా ఇస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు కోసం… ఈ నిర్ణయం తీసుకున్నట్లు బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర ఇంచార్జి శ్రీ సునీల్ దేవధర్ గారు, ఎం.పి.శ్రీ జి.వి.ఎల్.నరసింహరావు గారు, కేంద్ర మాజీ మంత్రి శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు దేశ రాజధాని ఢిల్లీలో ఈ విషయాన్ని సంయుక్తంగా ప్రకటించారు. బి.జె.పి.లోని వివిధ స్థాయి నాయకులతో చర్చించిన తరవాత ఈనిర్ణయం తీసుకున్నారు.
