ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ శాసనమండలి రద్దు అవుతుందనే అంశం. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ఆయన ఆస్థాన మీడియా పచ్చ మీడియాలో,తెలుగు తమ్ముళ్ళ నోట విన్పించే మాట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏపీ శాసనమండలిని రద్దు చేస్తుంది అని.
మరో రెండేళ్ల వరకు మండలిలో వైసీపీకి మెజారిటీ వచ్చే అవకాశం లేకపోవడం.. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రవేశ పెట్టిన ఎస్సీ,ఎస్టీలకు వేరుగా కమిషన్ బిల్లు,సీఆర్డీఏ బిల్లు,అభివృద్ధి వికేంద్రీకరణ,మూడు రాజధానులు తదితర బిల్లులను టీడీపీ అడ్డుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నది అని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై వైసీపీకి చెందిన నేత,మంత్రి కన్నాబాబు స్పందించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ మండలిని రద్దు చేసే ఆలోచనలో తమ ప్రభుత్వం లేదు అని తేల్చి చెప్పారు.ఇలాంటి నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకోదు అని అన్నారు.