బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మూవీకి తాను తీసుకునే రెమ్యూనేషన్ ను భారీగా పెంచేశారు. ఏకంగా రెమ్యూనేషన్ రూ.120కోట్లకు పెంచినట్లు బీటౌన్ లో ప్రచారం జరుగుతుంది.
ఇక నుండి అక్షయ్ కుమార్ నటించబోయే ప్రతి సినిమాకు అంతమొత్తంలో డిమాండ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత కొన్నేళ్ళుగా అక్షయ్ కుమార్ నటించిన ప్రతి సినిమా రూ.100-200కోట్లకు పైగా కలెక్షన్లను వసూళ్లు చేస్తుండటంతో అక్షయ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఒకవేళ అక్షయ్ కుమార్ ఇంతమొత్తంలో పారితోషకం తీసుకుంటే దేశంలోనే అత్యధిక పారితోషకం అందుకున్న హీరోగా చరిత్రకెక్కనున్నాడు.