వినడానికి వింతగా.. నమ్మశక్యంగా లేకపోయిన కానీ ఇదే నిజం. ఈ విషయాన్ని అందాల రాక్షసి త్రిష చెప్పింది. త్రిష గతంలో ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ తో ప్రేమాయణం నడిపి.. డేటింగ్ కూడా చేసింది. ఆ తర్వాత చెన్నై మహనగరంలో చాలా గ్రాండ్ గా నిశ్చితార్థం కూడా జరిగింది.
కొన్ని రోజులకు ఏదో గొడవలు వచ్చి వీరిద్దరూ విడిపోయారు . అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన వివాహాం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇన్ స్ట్రాగ్రాంలో తన అభిమానులకు ఈ ముద్దుగుమ్మ నిత్యం అందుబాటులో ఉంటుంది. తన అభిమానులతో మాట ముచ్చట్లలో భాగంగా ఒక అభిమాని మీ జీవితంలో తప్పకుండా నెరవేర్చుకోవాల్సిన కోరిక ఏమైన ఉందా అని అడిగాడు. దీనికి త్రిష స్పందిస్తూ “అవును ఉంది.
అదే నా వివాహాం లాస్ వెగాస్ లో చాలా ఘనంగా జరగాలి అని కోరుకుంటున్నాను”అని అమ్మడు బాంబు పేల్చింది. అయితే తాను వరుడు ఎవరో చెప్పకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ బక్కపలచు భామ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న మూవీలో నటిస్తుంది. దీంతో పాటు అమ్మడు చేతిలో ఇంకా పది సినిమాలు ఉన్నాయి.