జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శాసనసభ్యుడు రాపాక వరప్రసాదరావు కనీసం లెక్కచేయడం లేదు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఓడిపోయారు అదే క్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసింది కానీ రాపాక వరప్రసాద్ తనకున్న ప్రజా బలంతో గెలుపొందారు. అయితే గెలిచినట్టు నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా తాను పూర్తిగా సమర్పిస్తానని చెప్పుకొస్తున్నారు ఈ క్రమంలో మూడు రాజధానులకు మద్దతిచ్చారు. పవన్ కళ్యాణ్ ఓ వైపున అమరావతి ఉద్యమంలో పాల్గొంటే రాపాక మాత్రం పవన్ పట్టించుకోకుండా రాజధాని లకు మద్దతు ఇస్తున్నారు ఎవరైనా మీ పార్టీ అధ్యక్షుడు స్టాండ్ వేరు వేరు కదా అంటే ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని తెగేసి చెబుతున్నారు. అయితే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న రాపాక పై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.