తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాక్షిగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇజ్జతు ను మంత్రి కొడాలి నాని తీసేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ రాజధాని మార్పిడి.దీనికి వ్యతిరేకంగా టీడీపీ ధర్నాలు.. రాస్తోరోకులు చేస్తుంది. అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఆమోదం జరిగింది.
ఆ తర్వాత బిల్లుపై చర్చలో భాగంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ” తెలంగాణ వాదం లేదు అని ఆర్టీసీ మాజీ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడితే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ప్రతిపక్షంలో ఉండి కూడా రెండు సార్లు తన ఎమ్మెల్యే,ఎంపీ పదవీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలుపొంది తెలంగాణ వాదాన్ని విన్పించారు.
అదే విధంగా చంద్రబాబు నాయుడు రాజధాని మార్పిడిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని భావిస్తే బాబుకు దమ్ము ధైర్యముంటే తన పార్టీ తరపున గెలుపొందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను రాజీనామా చేయించాలి.
ఉప ఎన్నికలకు వెళ్లాలి. ఒకవేళ ఉప ఎన్నికల్లో అదే టీడీపీ ఇరవై మూడు ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీలు గెలుపొందితే రాజధాని మార్పిడిని ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు .. ఓడిపోతే ప్రజలు సమర్ధిస్తున్నట్లు.. మరి బాబుకు అంత దమ్ము.. ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క బాబు చేయగలరా అని నిలదీశారు.