సూపర్ స్టార్ మహేష్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా లేడీ అమితాబ్ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటించింది. మరోపక్క దీనికి డీఎస్పీ సంగీతం అందించాడు. ఇదంతా పక్కనపెడితే జనవరి 11న చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతే ఇక టాలీవుడ్ లో సెన్సేషన్ క్రిఏట్ చేసింది. కలెక్షన్లు కొల్లగొట్టాయి. అటు బన్నీ సినిమా కూడా బాగునప్పటికే కలెక్షన్లు పరంగా కొంచెం వెనకబడింది. కాని అసలు విషయం ఏమిటంటే ఓవర్సీస్ విషయానికి వస్తే అక్కడ మహేష్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. అలాంటిది అక్కడ మహేష్ సినిమా కన్నా బన్నీ సినిమానే కలెక్షన్లు పరంగా టాప్ లో ఉంది. ఆ ఒక్కటి పక్కనపెడితే మిగతా వాటిలో మహేష్ నే టాప్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
