తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీల్లో.. పది కార్పోరేషన్లలో ఈ రోజు బుధవారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుస్తామనే ధీమాతో ఉండగా .. ప్రతిపక్షాలు మాత్రం తమ ఓటమికి కారణాలను వెతికే పనిలో ఉన్నారు.
ఈ క్రమంలో త్వరలోనే నిజామాబద్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి పై పార్టీ ఫిరాయింపుల కింద అనర్హ్హత వేటు పడింది.దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
అయితే భూపతిరెడ్డి పదవీకాలం 2022 జనవరి నాలుగో తారీఖు వరకు ఉంది. అయితే స్థానిక సంస్థల తరపున ఈ స్థానానికి ఎన్నిక జరగడానికి కనీసం డెబ్బై ఐదు శాతం ఓటర్లు ఉండాలి. ఈ నిబంధన వలన జెడ్పీ ఎన్నికలు జరిగిన కానీ ఇంకా రెండు శాతం ఓటర్లు తక్కువగా ఉండటంతో ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు జరగనుండటంతో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికకు మార్గం సుగమైంది.