టీమిండియాకు గట్టి దెబ్బ తగిలింది. త్వరలో కివీస్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం రంజీ మ్యాచ్లో ఆడుతున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చీలమండకు గాయమైంది. ఇషాంత్ శర్మకు గాయం కావడంతో టెస్టు సిరీస్ కు అతడు అందుబాటులో ఉంటాడా..? లేదా అనేది సందేహాంగా మారింది.
విదర్భతో రెండో ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఈ ముపై ఒక్క ఏళ్ళ ఢిల్లీ పేసర్ ఫుల్ లెంగ్త్ లో వేసిన బంతి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ప్యాడ్లకు తాకింది. దీంతో అంపైర్ వైపు తిరిగి అప్పీల్ చేయబోతూ అదుపుతప్పి కిందపడగా ఇషాంత్ శర్మ పాదం మడత పడింది.ఇప్పటికే ఇషాంత్ కు నొప్పి ఉన్న చోట బాగా వాచింది.
ఈ మ్యాచ్లో అయితే అతడ్ని ఆడించి రిస్క్ల్ తీసుకోలేం. ప్రాక్చర్ కాకుడదని కోరుకుంటున్నాం.. ఒకవేళ వాపు అయితే కొద్ది రోజుల్లోనే కోలుకుంటాడు. అయితే చికిత్స కోసం అతడు జాతీయ క్రికెట్ శిబిరానికి వెళ్లి ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది’ అని ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది.