తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు తాడిచెర్ల ఏఎంఆర్ కంపెనీ జనరల్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి భూపాలపల్లి జనరల్ మేనేజర్ గారు విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో జెన్కో,ఏఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా మరో ముగ్గురికి సిద్దయ్య కెటిపిపి సీఈ గారు, ఎమ్మార్వో శ్రీనివాస్ తాడిచెర్ల గారు , ఎస్సై నరేష్ కొయ్యుర్ గార్లకి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
ఈ సందర్భంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం భావితరాలకు చాలా ఉపయోగకరమైనది . సంతోష్ కుమార్ గారి పేరుతో త్వరలో నర్సరీ ప్రారంభిస్తామని ప్రభాకర్ రెడ్డి గారు తెలిపారు.