తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న పురపాలక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కు చెందిన కాన్వాయ్ సోమవారం వనపర్తి నుండి కొత్తకోటకు వెళ్ళింది.
ఈ క్రమంలో కొత్తకోట పట్టణంలోని భారత్ గ్యాస్ కార్యాలయం సమీపంలో మంత్రి కాన్వాయ్ కు బర్రె అడ్డురావడంతో ఫైలట్ వాహన డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేక్ వేశారు.
దీంతో మంత్రి వాహానం వెనక ఉన్న ఎస్కార్ట్ వాహానం ఒక్కదానికొకటి స్వల్పంగా ఢీకోట్టడంతో ఆ వాహానాలు దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.