అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన అధికార వికేంద్రీకరణ బిల్లుపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు…ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ఈ రాష్ట్రానికి 17వ ముఖ్యమంత్రి అని, చరిత్రలో ఏ సీఎం అయినా రాజధానిని మార్చాలని చూశారా? అని నిలదీశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని మా పార్టీ సిద్దాంతం అని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజధాని పెట్టొద్దని చెప్పలేదంటూ వాదించారు. అందరూ నన్ను వ్యక్తిగతంగా తిట్టడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారంటూ వైసీపీ సభ్యులపై ఆరోపణలు గుప్పించారు. బంగారు గుడ్డు పెట్టే బాతులా అమరావతి మారుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. సీఎం జగన్‌కు చేతులెత్తి దండం పెట్టారు. జగన్మోహన్‌రెడ్డిగారూ! నాకంటే చిన్నవాడివైనా రెండు చేతులెత్తి మీకు నమస్కారం పెడుతున్నాను..ఆలోచించండి.. తొందరపడకండి..ఇది మంచిది కాదు..మూడు రాజధానులు ఎక్కడా సక్సెస్ కాలేదు.. ఎక్కడా జరగలేదు..మూడు రాజధానుల వల్ల డెవలప్ జరగదు.. దయచేసిన రాజధానిని ఇక్కడే ఉంచండి. మూడు రాజధానుల ఆలోచనను మానుకోండి. రాజధాని తరలింపుపై పునరాలోచించుకోండి అంటూ రిక్వెస్ట్ చేశారు.
అయితే తాజాగా సీఎం జగన్‌కు నిండు అసెంబ్లీలో చంద్రబాబు చేతులెత్తి దండం పెట్టడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అయ్యా జగన్‌మోహన్ రెడ్డి…కన్నా వయసులో చిన్నవాడివైనా… రెండు చేతులు జోడించి నీకు నమస్కరిస్తున్నాను. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సంపాదించిన మొత్తం అంతా పెట్టుబడిగా పెట్టించి…. బినామీల పేర్లతో ఒకే చోట నాలుగు వేల ఎకరాలను కొనిపించుకున్నాను.. మీరు ఇప్పుడు వికేంద్రీకరణ పేరుతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తానంటే మా పరిస్థితి ఏంటీ.. జీవితంలో ఇంకెప్పుడూ ఒకే చోట నా బినామీలతో భూములు కొనిపించను… ఇప్పటికే 12 మంది ఎమ్మెల్సీలు నాకు మొహం చాటేశారు…. ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు వదిలేసి వెళ్లిపోయారు….ఏదో పెద్దవాడిని…. చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను…దయచేసి మూడురాజధానులపై ఆలోచించు..అంటూ చంద్రబాబు సీఎం జగన్‌ను వేడుకుంటున్నట్లుగా నెట్‌జన్లు ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌కు చంద్రబాబు చేతులెత్తి దండంపెట్టడంపై సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతోంది.