ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు సేవ్ అమరావతి పేరుతో జిల్లాలలో పర్యటిస్తూ, జోలె పట్టి అడుక్కుంటూ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్న ఈ ఉన్మాదిని బలి ఇవ్వాలా వద్దా అంటూ చంద్రబాబు దారుణమైన భాషలో ప్రజలను రెచ్చగొడుతున్నాడు. సీఎం జగన్‌ను బలి ఇవ్వాలన్న చంద్రబాబు మాటలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
తాజాగా కోవైరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చంద్రబాబు వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేక పిచ్చిప్రేలాపనలు చేస్తూ రాజధాని రైతులను రెచ్చగొడుతున్న చంద్రబాబునాయుడు మనిషి కాదని…నరరూపరాక్షసుడని, తమ నాయకుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత ఆయనకు లేదని నల్లపురెడ్డి ఫైర్ అయ్యారు. స్థానిక బెజవాడగోపాల్‌రెడ్డి పార్క్ వద్ద ఆదివారం జరిగిన వలంటీర్ల స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నల్లపురెడ్డి జగన్‌మోహన్‌రెడ్డిని బలివ్వాలని అన్న చంద్రబాబునాయుడి మాటలపై మండిపడ్డారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన నీచమైన చరిత్ర చంద్రబాబునాయుడిదని..ధ్వజమెత్తారు.
వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఆశీర్వదించారని, 151 మందిని ఎమ్మెల్యేలుగా, 22 మందిని ఎంపీలుగా గెలిపించారన్నారు. అటువంటి వ్యక్తిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న చంద్రబాబును నడిరోడ్డుపై ఉరితీయాలని. గత ఐదేళ్లు అవినీతి, అరాచకాలతో ప్రజలను పీడించిన నీలాంటి నరరూప రాక్షసుడిని ప్రజలు ఎన్నికలలో బలి ఇచ్చారని ఫైర్ అయ్యారు. నమ్మినవారికి అండగా ఉండడం జగన్‌మోహన్‌రెడ్డి నైజమని, అదే నమ్మినవారిని తడిగుడ్డతో గొంతుకోయడం చంద్రబాబు నైజమని నల్లపురెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. అమరావతిలో తాము దోచుకున్న భూములకు విలువ ఎక్కడ పడిపోతుందనే భయంతో సీఎం జగన్‌ను బలి ఇవ్వాలంటూ ఉన్మాదంతో మాట్లాడుతున్న చంద్రబాబు ఒక మానసిక రోగి అని నల్లపురెడ్డి విరుచుకుపడ్డారు. మొత్తంగా సీఎం జగన్‌పై చంద్రబాబు చేసిన విమర్శలకు నల్లపురెడ్డి పసన్నకుమార్ రెడ్డి ధీటైన కౌంటర్ ఇచ్చారు.