నందమూరి బాలయ్య సినిమా, సినిమాకు హెయిర్‌స్టైల్స్ మారుస్తుంటారు..అదే విగ్‌లండీ….సింహా, లెజండ్ వంటి సినిమాల్లో విగ్‌లు సెట్ అయినా..మిగతా సిన్మాలలో మాత్రం బాలయ్యకు విగ్‌లు అంతగా సెట్‌అవడం లేదు..ఇటీవల విడుదలైన రూలర్ మూవీలో బాలయ్య గెటప్‌లు, విగ్‌లు చూసి తట్టుకోలేక ఆయన ఫ్యాన్సే థియేటర్ల నుంచి పారిపోయారంటే నమ్మండి..ఆ సిన్మాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ ధర్మ క్యారెక్టర్‌కు పెట్టిన విగ్‌పై అయితే సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ నడిచింది. ఒక్క సిన్మాల్లో ఏంటీ..బయట కూడా బాలయ్య విగ్‌లతోనే తిరుగుతుంటారు.
.అయితే తాజాగా ఎన్నడూ చూడని లుక్‌లో బాలయ్య కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. రీసెంట్‌గా బాలయ్య తనకు అచ్చివచ్చిన డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్‌లో నటిస్తున్నారు. ఈ సిన్మాను త్వరలోనే సెట్స్‌పైకి తీసుకువెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అయితే బాలయ్యకు రోజూ విగ్‌లు బోరు కొట్టాయేమో..సడన్‌గా గుండు లుక్‌లోకి మారిపోయారు. ఫుల్ బ్లాక్ అండ్ వైట్ డ్రస్‌లో గుండుతో ఉన్న బాలయ్య పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ విప్ జారీ చేయడంతో హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య టీడీఎల్పీ సమావేశానికి హాజరయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోటో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో దిగింది అని మరొక వాదన వినిపిస్తుంది. నున్నటి బోడిగుండు, నల్లటి బుర్ర మీసాలు, తెల్లటి గడ్డంతో బాలయ్య వెరైటీగా కనిపిస్తున్నారు. కాగా బోయపాటి సిన్మాలో బాలయ్య ఈ గుండు గెటప్‌తో కనిపించబోతున్నారంటూ..ఫ్యాన్స్ అంటున్నారు… మొత్తంగా బాలయ్య గుండులుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.