తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం జాతర వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి మొదలు కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం ఇప్పటికే పలు ఏర్పాట్లను పూర్తి చేసింది.ఈ క్రమంలో మేడారంలో వనదేవతలు సమ్మక్క,సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు ఈ మహా మేడారం జాతర జరగనున్నది. అయితే ఆదివారం ఒక్కరోజే మొత్తం మూడు లక్షల మందికిపైగా భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు .
అటు అనూహ్య రద్ధీ నేపథ్యంలో సరిపడా ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తెగ ఇబ్బంది పడటంతో ఆ సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. అందుకు తగిన అన్ని ఏర్పాట్లను ఈనెల ఇరవై ఆరు తారీఖు లోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సీఎస్ ఆదేశాలను జారీచేశారు.