తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రగతి బాటన పయనిద్దాం అనే నినాదంతో TRS NRI లు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు.
18 వార్డ్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొర్రొల్ల గంగారం గెలుపు కోసం TRS ఖతర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ నాయకులు నరేష్ కోరం గారు మెట్‌పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి గడప గడప ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముదాం నర్సింలు, బద్దం రాజేష్, డబ్బ రాజారెడ్డి, కట్కం బుచ్చిరెడ్డి, డాకూరి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.