తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డిలో మంత్రి హారీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”35 కోట్లు సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్దికి మంజూరయ్యాయి.పోతిరెడ్జి పల్లిలోని ఐదు సంగారెడ్డిలో కలిసాయి. ఈ ఐదు వార్డులు బాగా అభివృద్ధి చెందాలి.మున్సిపాలిటీ లో ఉంటే నిధులు ఎక్కువ వస్తాయి.ఇక్కడ ఎమ్మెల్యేకు మాటలకు ఎక్కువ. చేతలకు తక్కువ. ఆయనచేతల్లోఏమీ లేదు. తెరాస ప్రభుత్వం ఇక్కడ ఉంది.ఢిల్లీలోకాంగ్రెస్ ప్రభుత్వం లేదు. రాజ్య సభ సభ్యుడు లేడు. ఎసీడీపీ నిధులు ఒక్క రూపాయి లేదు.ఈ ఏడాది లో ఇక్కడి ఎమ్మెల్యే రూపాయి పని చేయలేదు. పైసా పని చేయని వాడు..
నాలుగేళ్లు ఏం పని చేస్తారు.డబ్బులున్నాయని బాగా ఖర్చు చేస్తున్నాడంట.మన వాళ్లు పేదవాళ్లు…పని మాత్రం బాగా చేస్తారు. పని చేసిన వాళ్లను గెలిపించండి.దున్నపోతుకు గడ్డి వేస్తే బర్రె పాలిస్తదా.పాలు ఇచ్చే బర్రెకే గడ్డి వేయాలి.మీ దయతోతెరాస అధికారంలో ఉంది.నాలుగేళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఉంటుంది. ఎంపీగా ప్రభాకర్ రెడ్డి ఉంటారు. ఏదైనా చేస్తే తెరాస ప్రభుత్వం చేయగలుగుతుంది తప్ప వేరే ఎవరైనా చేస్తరా.బ్యాట్ గుర్తు, క్యారం బోర్డు , చేయి, పూవు గుర్తులోళ్లు తెగ తిరిగుతున్నారు.
ఇవాళ ఎన్నికలని తిరిగే వీళ్లు ఎన్నికల తర్వాత కనపడతడా.రాష్ట్రంలో ఉండేది తెరాసనే.పదోవార్జులో ఎల్లమ్మ గుడిచుట్టూ ప్రహరీ, చిల్డ్రన్స్ పార్కు మంచిగ చేసుకోవాలి.డ్వాక్రా బిల్డింగ్, సీసీ రోజ్లు మోరీ లుకట్టుకోవాలి. వీటికినిధులు కావాలి.తెరాస కాకుండా వేరే వాళ్లు గెలిస్తే అభివృద్దిచేస్తరా..అసలు తెరాస వాళ్లనే గెలిపించండి.సంగారెడ్డి కి మెడికల్ కాలేజ్ ఇచ్చారని కరపత్రాలు వేసి, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పాడు ఇక్కడి ఎమ్మెల్యే ఇప్పుడేమో సీఎంపై విమర్శలుచేస్తున్నారు.మీ చేతిలోఏం అధికారం ఉంది.ఏం అభివృద్ధి చేస్తావు.గెలిచే పార్టీ తెరాసానే అని అన్నారు.