తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రియాశీల (డైనమిక్) నగరాల జాబితాలో భాగ్యనగరం ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలిచింది.
ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ 2020కి గాను మోస్ట్ డైనమిక్ సిటీగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది.
ఈ మేరకు సిటీ మూమెంటం ఇండెక్స్-2020 జాబితాను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ జాబితాలో మొదటి 20 స్థానాల్లో భారత్‌కు చెందినవే 7 నగరాలు ఉండడం గమనార్హం.
భారత్ నుంచి చెన్నై (5వ స్థానం), దిల్లీ (7వ స్థానం), పుణె (12వ స్థానం), కోల్‌కతా (16వ స్థానం), ముంబయి (20వ స్థానం) ఈ జాబితాలో ఉన్నాయి.