మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రతిపక్షాలు కనీసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డివిజన్లలో పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే టీఆర్ఎస్ మాత్రం అన్ని మున్సిపాలిటీలలో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జనగామలోని 7 వ వార్డులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఇంటింటి ప్రచారానికి వెళ్లారు. ప్రచారం చేస్తుండగా ఆయనకు ఓ వృద్ధ మహిళ ఎదురైంది. ఎమ్మెల్సీ పోచంపల్లి ఆ మహిళను టీఆర్ఎస్‌కు ఓటేయమని కారు గుర్తు చూపిస్తుండగా..కేసీఆర్ మా పెద్ద కొడుకు అన్నది..మాటల్లో మాట కలవడంతో పోచంపల్లి మరోసారి ఏంటని ఆమెను అడుగగా..కేసీఆర్ మా పెద్ద కొడుకు అని చెప్పింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఆ తర్వాత ఎమ్మెల్సీ పోచంపల్లి కారు గుర్తును చూపిస్తూ..టీఆర్ఎస్‌కు ఓటేయాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయల పింఛన్‌ను, రెండువేల పదహారు రూపాయలకు పెంచారు. దీంతో సీఎం కేసీఆర్ నిరుపేద అవ్వాతాతలకు పెద్దకొడుకుగా నిలిచిపోయారు. ఇవే విషయం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బామ్మ చాటిచెప్పింది. మొత్తంగా కేసీఆర్ పెద్ద కొడుకు అంటూ బామ్మ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.