కనుమ పండుగ రోజు ఏ పని మొదలుపెట్టరు..అసలు ఈ రోజు ఎలాంటి పని చేయరు..అలాంటి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బీజేపీ నేతలతో చర్చలకు వెళ్లారు. ఒకపక్క పవన్ పార్టనర్ చంద్రబాబేమో పండుగ పూట పస్తులుంటూ అమరావతి రాజధాని కోసం నానా తిప్పలు పడుతున్నారు. నెలరోజులుగా బాబుగారు రోడ్డుమీద కూర్చున్నా..జోలెపట్టుకుని అడుక్కున్నా…మహిళల గాజులు, ఉంగరాలు, కాళ్లపట్టీలు వసూలు చేసినా..అమరావతి ఆందోళనలను రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మల్చలేకపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం అధికార, పరిపాలనా వికేంద్రీకరణ దిశగా మూడు రాజధానుల ఏర్పాటుకే ముందడుగు వేస్తోంది. ఈ తరుణంలో తనతో పాటు పవన్ కూడా రంగంలోకి దిగుతాడని చంద్రబాబు అనుకుంటే..ఆయనగారు మాత్రం కాషాయంతో పొత్తుకోసం పరుగులు పెడుతున్నారు..ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు ఉండి..ఆఖరికి బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమై వచ్చారు..ఇవాళ కనుమ రోజు విజయవాడలో ఏపీ బీజేపీ నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ తరపున ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావులు, జనసేన తరపున షరామామూలుగా పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీతో పొత్తుపెట్టుకోవడమా.. లేకుంటే..పూర్తిగా విలీనం చేసుకోవడమా..అనే అంశంపై బీజేపీ నేతలు చర్చించినట్లు సమాచారం.
అయితే చంద్రబాబుతో రహస్య పొత్తు కుదుర్చుకున్న పవన్‌తో కలిసి ఎలా పని చేస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు కుండబద్ధలు కొట్టినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో చీకటి రాజకీయాలు చేస్తూ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కుదరదని పవన్‌కు తేల్చిచెప్పినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా.. మొత్తంగా పవన్ తన పార్టీని బీజేపీలోకి విలీనం చేయడం ఖాయమని సమాచారం. ప్రతిగా పవన్‌కు రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు లేదా..కేంద్రంలో కీలక పదవి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక పక్క ఎక్కడ తన సామాజికవర్గానికి దెబ్బ పడుతుందో అని రాజధాని రాజకీయంలో తాను కిందామీదా పడుతుంటే..సరిగ్గా టైమ్ చూసి తన సీక్రెట్ పార్టనర్ పవన్ ఇలా బీజేపీ పంచన చేరడం..చంద్రబాబుకు షాకింగ్‌గా మారింది. రాజధాని రాజకీయంలో తనకు పవన్ తోడుగా ఉంటాడని భావించిన చంద్రబాబు ఇప్పుడు మారుతున్న పరిణామాలతో మరింత ఆందోళనకు గురవుతున్నాడు. మొత్తంగా పండుగ పూట బీజేపీతో కలిసిపోయి పవన్ చంద్రబాబుకు గట్టిషాకే ఇచ్చాడని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.