టీడీపీ అధినేత చంద్రబాబుకు జాతీయ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దాదాపుగా నెలరోజులుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతుల ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తుళ్లూరు మందడం, వెలగపూడి వంటి 5 గ్రామాల్లో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రైతులు తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే అమరావతి ఆందోళనల్లో మగవారి కంటే మహిళలే ఎక్కువగా పాల్గొనడం గమనార్హం. మహిళలు అయితే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని చంద్రబాబు ప్లాన్..అందుకే మహిళలను రోడ్డుమీదకు తీసుకువచ్చి నిరసన కార్యక్రమాలను చేయిస్తున్నాడు. మహిళలు సీఎం జగన్‌ను నోటికి వచ్చినట్లు దూషిస్తూ..పొలీసులను రెచ్చగొడుతున్నారు. ఆందోళన చేస్తున్న మహిళలను అడ్డుకోవడం మహిళా పోలీసులకు కూడా తలనొప్పిగా మారింది. మరోవైపు నిరసన తెలుపుతున్న మహిళలపై పోలీసులు అమానుషంగా దాడులు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో జాతీయ మహిళా కమీషన్ జోక్యం చేసుకుని రాజధాని గ్రామాల్లో వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు తమ ప్రతినిధుల బృందాన్ని పంపింది.
రాజధాని గ్రామాల్లో పర్యటించిన ప్రతినిధుల కమిటీకి ఇటు రాజధాని మహిళలు పోలీసులపై ఫిర్యాదులు చేయగా…అటు మహిళా పోలీసులు కూడా నిరసననకారులపై ఫిర్యాదులు చేశారు. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని…కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా..కూర్చునే చోట కారం, తారు చల్లుతూ..వేధిస్తున్నారని.. మగవాళ్లయితే ఇంటికి వెళ్లి కాపురం ఏం చేస్తారు..మాతో పడుకోండి అంటూ లైంగికంగా వేధిస్తున్నారని మహిళా పోలీసులు ఏకంగా జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదులు చేశారంటే..రాజధాని గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అమరావతిలో పర్యటించి వాస్తవ పరిస్థితి తెలుసుకున్న జాతీయ మహిళా కమీషన్…చంద్రబాబు కుటిల రాజకీయాన్ని గమనించింది..పోలీసులను రెచ్చగొట్టి.. వారు లాఠీచార్జీ చేసే పరిస్థితులు తీసుకువచ్చి..ఆ తర్వాత మహిళలపై దాడి అంటూ ప్రచారం చేయాలన్నదే చంద్రబాబు వ్యూహంగా జాతీయ మహిళా కమీషన్ పసిగట్టింది. అందుకే మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ ఆడవాళ్లతో రాజకీయాలు వద్దు అంటూ చంద్రబాబుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు మా టీమ్ ఆల్రెడీ రాజధాని గ్రామాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నారు. అయితే రాజధాని రాజకీయంలో మహిళలను లాగడం ఏం బాలేదు..చాలా పెద్ద తప్పు చేస్తున్నారంటూ..రేఖా శర్మ ట్వీట్ చేశారు. మొత్తంగా మహిళలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు చేస్తున్న స్వార‌్థరాజకీయాలను జాతీయ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ ఎండగట్టింది.