ఆంధ్రప్రదేశ్ మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. ఇక టీడీపీ విషయానికి వస్తే ఎంత దారుణంగా ఓడిపోయిందో అందరికి తెలిసిన విషయమే. ఇక జనసేన అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కనీసం తాను పోటీ చేసిన ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. అప్పుడైనా ఆయనకు అర్ధం కాలేదేమో సినిమా, రాజకీయం ఒకటి కాదని. ఇక ఓడిపోయాక అటు చంద్రబాబు ఐనా ఇటు పవన్ కళ్యాణ్ ఐనా సరే వైసీపీని నిందించాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని చేసినా బెడిసికొడుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన మహిళా కార్యకర్తలు ప్రజల్లో సానుభూతి కోసం ఏవేవో చెయ్యాలని చివరికి ఓవరాక్షన్ చేసారు గాని అదికూడా బెడిసికొట్టింది. ఈ సంఘటన కాకినాడలో చోటుచేసుకుంది.
వైసీపీ నేతనలు వారిపై దాడి చేసినట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చెయ్యాలని అనుకున్నారు.ఈ సందర్భంగా ఓ మహిళ ఇంకో మహిళను ‘ఊ.. స్టార్ట్ చెయ్యి.. మొదలుపెట్టు’ అని చెప్పగా వెంటనే ఆమె ఏడ్చడం మొదలు పెట్టింది. ఇందులో దాంతో పక్కన ఉన్న వారు కోరస్ అందుకొని స్క్రిప్ట్ పరంగానే చదవడం మొదలెట్టారు. ఇదంతా కూడా ఎమ్మెల్యే ద్వారంపూడిని విమర్శించి, వైసీపీపై కుట్రలు చెయ్యాలని తయారుచేసిన వీడియో లో ముందుగా మాట్లాడిన మాటలు కూడా రికార్డు అవ్వడంతో అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా ఏదోక రూపంలో ప్లాన్ లు వేసుకొని చివరికి అడ్డంగా దొరికిపోయిన వాళ్లకి ఇంకా బుద్ధిరాలేదనే చెప్పాలేమో మరి.