ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలను నమ్మించి మోసం చేసి చివరికి గెలిచారు. అది కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ సపోర్ట్ తో గెలిచారు. గెలిచేంత వరకు మోదీతో కలిసి ఉన్న బాబు ఒక్కసారిగా ప్లేట్ తిప్పెసారు. తాను అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకి చేసింది ఏమీ లేదు. కాని అధికారం మొత్తం వారి కుటుంబానికి , దగ్గరవాళ్ళకే ఉపయోగపడింది. దాంతో విసిగిపోయిన ప్రజలు చంద్రబాబుకి ఎలాగైనా బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు కూడా ఏమీ చెయ్యలేదని తెలుసు కాబట్టే ఈసారి ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను మళ్ళీ మోసం చెయ్యాలని నిర్ణయించుకొని ఓట్లకోసం ఏవేవో చేసారు.
ఆకరికి మల్లా పవన్ తో కలిసి చాటుమాటు వ్యవహారాలు చేసారు. కాని చివరికి ఇద్దరు కూడా దారుణంగా ఓడిపోయారు. ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో జీర్ణించుకోలేకపోతున్న చంద్రబాబు అధికార పార్టీపై నిందలు మోపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదనే చెప్పాలి. దీనిపై ఘాటుగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.”యజమాని ఆర్డరేస్తేనే ప్యాకేజీ స్టార్ బిజెపి చుట్టూ తిరుగుతున్నాడు. రాష్ట్ర బిజెపిని తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ముందుగా పావలాను పంపిస్తున్నాడు బాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలానికి పొత్తు వల్ల ఒరిగేదేమి లేకున్నా సైకిల్ పార్టీకి మేలు జరిగేలా చూసుకోవాలనేది బాబు ఎత్తుగడ” అని అన్నారు.