భోగిమంటలు వేయడం వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. భోగిమంటలలో ఆవు పేడతో తయారు చేసిన పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. అలాగే భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు. ఈ ఔషద మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇదే భోగి మంటల వెనుక దాగి ఉన్న ఆరోగ్య సూత్రం.
