భోగి పండుగ అనేది తెలుగు ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ. తెలుగు వారు జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. అచ్చ తెలుగు తెలుగు సంస్కృతిని. పల్లె సంప్రదాయాలను చాటుతూ వచ్చిన పండుగ సంక్రాంతి పండుగ..సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. ఈ మూడు రోజుల సంక్రాంతి సంబరాలు భోగి పండుగతో మొదలవుతాయి. భోగి పండుగ అనగానే భోగిమంటలు, అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, తలస్నానాలు, పిల్లలకు రేగుపండ్లు పోయడం ఇవన్నీ గుర్తుకువస్తాయి..అసలు భోగి పండుగ సందడి తెల్లవారముందే భోగి మంటలతో మొదలవుతుంది. పెద్దవాళ్లదగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు ఎంతో ఉత్సాహంగా భోగిమంటలు వేసుకుంటారు. ఈ సందర్భంగా దరువు సోషల్ మీడియా తరుపున తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు..!
