అసలు భోగి పండుగకు భోగి అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం..దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందురోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఈ మంటలు వేయడం వలన భోగీ అనే పేరు వచ్చింది. భోగిమంటలు అనగానే వెచ్చదనం కోసం వేస్తారని అనుకుంటారు.