టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్రస్థాయి ఉద్యమంగా మల్చేందుకు బస్సుయాత్రలు చేపట్టారు. జిల్లాలలో పర్యటిస్తూ..జోలెపట్టి అడుక్కుంటూ ఆ వచ్చిన మొత్తాన్ని అమరావతి పరిరక్షణ సమితికి అందిస్తున్నారు. అయితే చంద్రబాబు జోలెపట్టి అడుక్కోవడంపై వైసీపీ నేతలు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి స్పందించారు. “అమరావతిని ఎలా మారుస్తారని పళ్లు కొరికారు. ప్రభుత్వం కూలిపోతుందని శాపాలు పెట్టారు. ఉత్తుత్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. బంగారు నగల సేకరణకు దిగారు. తర్వాత జోలెతో ఊరూరూ తిరుగుతున్నారు. ఆఖరున వచ్చిన డబ్బును పంచుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లి పోతారు” అని అన్నారు.
