నా పేరు సూర్య దెబ్బతో అలాంటి సినిమా మళ్ళీ తీయకూడదని పకడ్బందీగా ప్లాన్ వేసి మరీ త్రివిక్రమ్ తో సినిమా ఒప్పుక్కున్నాడు. దానికి మాటల మాంత్రికుడు సరైన న్యాయమే చేసారు. ఈ సినిమా మొదటినుండి పాజిటివ్ టాక్ తోనే బయటకు వచ్చింది. ఇంక చెప్పాలంటే మ్యూజిక్ తో అభిమానులను కట్టేసారని చెప్పాలి. చివరికి అనుకున్నట్టుగానే సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ అని చెప్పాలి. మరోపక్క మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ అందరు ఫుల్ జోష్ లో ఉన్నారు. బన్నీ సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావడంతో ఈ సంక్రాంతి రేసులో ఈ పుంజే నెగ్గిందని చెప్పాలి.