ప్రస్తుతం వెబ్ సిరీస్ హావ కొనసాగుతుంది..భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు అగ్ర సంస్థలు పోటీ పడుతుండడం తో అగ్ర నటి నటులు కూడా ఈ సిరీస్ లలో నటించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టాప్ హీరోయిన్ సమంత ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుండగా..ఈమె బాటలోనే మరికొంతమంది భామలు క్యూ కడుతున్నారు. రీసెంట్ గా మిల్క్ బ్యూటీ తమన్న కూడా ఓ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తమిళంలోని ఓ వెబ్ సిరీస్ కథ పట్ల బాగా ఇంట్రస్టింగ్ గా ఉన్నారట. వెబ్ సిరీస్ స్టోరీస్ లో నటిస్తే తమ ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతో తమన్నా ఈ వెబ్ సిరీస్ లో నటించాలనుకుంటుందట. ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడు రామ సుబ్రమణ్యన్ డైరెక్ట్ చేయనుండగా, అనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తోంది.
