హైదరాబాద్ పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా..ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా పబ్‌ల యజమానులు లెక్కచేయడంలేదు. వీకెండ్‌లో పబ్‌లలో అమ్మాయిలతో అర్థనగ్నంగా డ్యాన్సులు వేయిస్తూ అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆదివారం సాయంత్రం పలువురు యువతీ యువకులు జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని టాట్ పబ్‌లో ఏర్పాటు చేసుకున్న పార్టీలో అశ్లీల నత్యాలు చేస్తున్నట్ల బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందింది. బంజారాహిల్స్ ఏసీపీ ఆదేశాలతో పోలీసులు అకస్మాత్తుగా ఆ పబ్‌పై రైడ్ చేసి అసభ్యకరంగా డ్యాన్సులు వేస్తున్న 23 మంది యువతులను అదుపులోకి తీసుకుని వారిని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే తాము పార్టీ చేసుకోవడానికి వచ్చామని తమను ఎందుకు వీడియోలు తీస్తున్నారంటూ ఆ యువతులు మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా కెమెరామెన్‌ల సెల్‌ఫోన్లు లాక్కొని కిందపడేశారు. కాగా సీడ్స్ కంపెనీకి చెందిన ఓ వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
