తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నల కుటుంబాలకు భరోసానివ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన అత్యున్నత పథకం రైతు బీమా.
అనారోగ్యం కారణంగా.. లేదా ఏదైన కారణంతో రైతు మరణిస్తే ఆ రైతును నమ్ముకుని ఉన్న కుటుంబం రోడ్డున పడకూడదు. ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఈ పథకంలో ఇప్పటికి పలు కారణాలతో అకాల మృతినొందిన దాదాపు 22,583 మంది రైతుల కుటుంబాలకు బీమా సంస్థ రూ.1,129.15కోట్లను పరిహారంగా చెల్లించింది. రైతు బీమా పథకానికి పద్దెనిమిదేళ్ల నుండి యాబై తొమ్మిదేళ్ల వయస్సున్న రైతులను అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటివరకు రైతు బీమా అందుకున్న రైతు కుటుంబాల వివరాలు ఇలా ఉన్నాయి.