మూడు ముళ్లతో..ఏడు అడుగులతో.. పంచభూతాల సాక్షిగా తనను పెళ్లి చేసుకున్న భర్త స్నానం చేయడంలేదని వింతైన నిర్ణయం తీసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్త త్రాగుబోతు అనో..తిరుగుబోతు అనో..లేదా పని పాట లేనోడు అనో..కట్నం కోసం వేధిస్తున్నాడనో.. అనుమానంతో చిత్రహింసలు చేస్తున్నాడనో విడాకులు కోరిన భార్యలను చూశాము..
కానీ మహారాష్ట్రలో పూణెకు చెందిన ఒక మహిళ తన భర్త స్నానం చేయడు..ముఖం కడుక్కోడు..గడ్డం గీక్కోడు..అతని నుండి వస్తున్న దుర్గంధం భరించలేను..
అందుకు నాకు విడాకులు విప్పించాలని మహారాష్ట్ర మహిళా కమిషన్ ను కోరిన సంఘటన వెలుగులోకి వచ్చింది.దీంతో షాకైన మహిళా కమిషన్ అధికారులు భర్తకు రెండు నెలలు కౌన్సిలింగ్ ఇస్తాము.అప్పటికి మారకపోతే విడాకులు మంజూరు చేయిస్తామని వారు తెలిపారు..