రేపు భోగి పండుగతో సంక్రాంతి సంబురాలు ప్రారంభం కానున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలోని చెడునంతా దహనం చేసి…జీవితంలోకి భోగ భాగ్యాల్నీ, కొత్త ఆశల్నీ, లక్ష్యాల్నీ ఆహ్వానించే పండుగదినం..భోగి అని సీఎం అన్నారు. ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విలసిల్లేలా దేవతలు దీవించాలని ముఖ్యమంత్రి ప్రార్ధించారు. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం వెల్లివెరియాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
