ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా సేవ్ అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకువెళ్లడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బస్సు యాత్ర ఇలా ఎన్నో చేస్తున్నారు. చివరికి విద్యార్దులను కూడా వదలడం లేదు. అప్పట్లో స్పెషల్ స్టేటస్ విషయంలో విద్యార్ధులు దూరంగా ఉండండి అని చెప్పిన బాబు ఇప్పుడు తన సొంత విషయానికి వచ్చేసరికి రివర్స్ అయ్యాడు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించాడు.”చంద్రబాబు లాంటి అవకాశవాది ఎక్కడా కనిపించడు. తన స్వార్థం కోసం, బినామీల కోసం అందరూ వీధుల్లోకి రావాలట. నేను పోరాటం చేస్తుంటే విద్యార్థులు ఇళ్లలో కూర్చుంటారా అని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడేమో ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ఆస్తుల ధర పడిపోకుండా అంతా అడ్డం నిల్చోవాలట”! అని అన్నాడు.