Home / ANDHRAPRADESH / బ్రేకింగ్..మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్..!

బ్రేకింగ్..మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా, అనుకూలంగా ధర్నాలు, ర్యాలీలతో అమరావతి ప్రాంతం అట్టుడికిపోతుంది. ఒకపక్క మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ.. టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అలాగే మరో పక్క పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా.. ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదాలతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అధ్వర్యంలో ప్రదర్శనలు హోరెత్తున్నాయి. తాజాగా అధికార వికేంద్రీకరణ దిశగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటూ రాజధానిలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే భారీ ర్యాలీ తలపెట్టారు.

 

గుంటూరు జిల్లా పెనుమాక నుంచి తాడేపల్లి భారత మాత విగ్రహం వరకు రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణతో సమగ్ర అభివృద్ధి జరగాలని కోరుతూ ఆర్కే తలపెట్టిన ఈ ర్యాలీలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అభివృద్ధి కావాలి.. వికేంద్రీకరణ జరగాలి అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా నినాదాలు చేశారు. అయితే అమరావతి గ్రామాల్లో 144 సెక్షన్‌ ఉండడంతో ఈ ర్యాలీకు అనుమతి లేదంటూ పోలీసులు ఎమ్మెల్యే ఆర్కేను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆయనకు మద్దతుగా వచ్చిన మహిళలు, నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. మొత్తంగా మూడు రాజధానులపై అనుకూల, వ్యతిరేక వర్గాల ర్యాలీలతో అమరావతి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat