టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం జనవరి 11న విడుదల కాగా మొదటిరోజే హిట్ టాక్ తెచ్చుకుంది. మరోపక్క జనవరి 12న అల్లు అర్జున్ సినిమా విడుదల కాగా అది కూడా సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఇక అసలు విషయానికి వస్తే మహేష్ తారక్ మధ్య ఎలాంటి అనుబంధం ఉందో అందరికి తెలిసిన విషయమే. తారక్ మహేష్ ను అన్నా అని పిలుస్తాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ మహేష్ భరత్ అనే నేను సినిమాకి గెస్ట్ గా వచ్చారు. అయితే తాజాగా ఎన్టీఆర్ బన్నీ సినిమా బాగుందని ట్వీట్ చేసాడు. అది కూడా బావా అని సంబోధించాడు. కాని మహేష్ విషయంలో ఎలాంటి స్పందనా లేకపోవడంతో అందరు ఆశ్చర్యపోయారు. వీరిద్దరి మధ్య ఏమైనా విబేధాలు ఉన్నాయా అనే అనుమానం వస్తుంది.