టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్రస్థాయి ఉద్యమంగా మల్చేందుకు బస్సుయాత్రలు చేపట్టారు. జిల్లాలలో పర్యటిస్తూ..జోలెపట్టి అడుక్కుంటూ ఆ వచ్చిన మొత్తాన్ని అమరావతి పరిరక్షణ సమితికి అందిస్తున్నారు. అయితే చంద్రబాబు జోలెపట్టి అడుక్కోవడంపై వైసీపీ నేతలు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు భిక్షాటనపై సంచలన వ్యాఖ‌్యలు చేశారు. సంక్రాంతికి బిచ్చగాని వేషం వేసిన చంద్రబాబు వీధుల్లో జోలె పట్టి అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి పేరుతో రాజకీయ పబ్బం గడుపు కోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ దెబ్బకు బాబు బిచ్చగాడిలా మారిపోయారని నానీ సెటైర్ వేశారు. బాబు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు.
గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతికి వచ్చారని నాని అన్నారు. గత ఐదేళ్లలో తాను చేసిన పాపాలకు…ఇప్పుడు జోలెపట్టి అడుక్కునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పూర్తిగా పగటి వేషగాడిలా మారిపోయారని వెటకారం ఆడారు. చంద్రబాబు ఏం చేసినా మూడు రాజధానుల ఏర్పాటు జగన్ నిర్ణయం మేరకే జరుగుతుందని తేల్చి చెప్పారు. ఇక చంద్రబాబు తనయుడు లోకేష్‌పై కూడా మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. తమ పార్టీకి 60 లక్షల సభ్యత్వం వుందని లోకేష్ చెబుతున్నారని… అయితే టీడీపీ సమావేశాలకు 500 మంది కూడా రావడం లేదని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమరావతి రైతుల ఆందోళనలపై మంత్రి స్పందిస్తూ…చంద్రబాబు మాటలు వింటే రైతులకు న్యాయం జరగదని , రైతులకు న్యాయం జరగాలంటే ప్రభుతం దృష్టికి తమ సమస్యలను తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో కావాలనే చంద్రబాబు అల్లర్లు సృష్టిస్తున్నారని మంత్రి కొడాల నాని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మొత్తంగా సంక్రాంతి బిచ్చగాడు అంటూ చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.