ఆడియో టేపుల వ్యవహారంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి ఛైర్మన్ పదవికి సినీనటుడు పృధ్వీరాజ్ రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారంపై వైసీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. పృధ్వీ ఓ మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడుతున్నట్లు ఓ ఆడియో టీమ్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ విషయంపై సీరియస్ అయిన టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆడియో టేపులపై విచారణ చేసి, నిజనిజాలు తేల్చాల్సిందిగా విజిలెన్స్ కమిటీని ఆదేశించారు. అదే విధంగా ఈ విషయాన్ని పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. టీటీడీ ప్రతిష్టకు మంటగలిపిన ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్..తక్షణమే.. పృధ్వీరాజ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. హైకమాండ్ ఆదేశాలతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పృథ్వీ ప్రకటించారు. ఈ మేరకు సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో పృథ్వీ మాట్లాడుతూ..తాను ఏ తప్పూ చేయలేదనీ, తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తాను పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మద్యం తాగలేదని…అవసరమైతే నా రక్తాన్ని పరీక్షించి వాస్తవం తెలుసుకోవాలని ఆయన అన్నారు. మహిళ తో అసభ్యంగా మాట్లాడరన్న ఆరోపణలు నిజం కాదని..అసలు ఆడియో టేపులో ఉన్నది నా గొంతు కాదని, ఫ్రాబ్రికేటెడ్ అని ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని పృథ్వీ తెలిపారు. తాను మహిళతో అసభ్యంగా మాట్లాడానని రుజువైతే చెప్పుతో కొట్టడంటూ పాదరక్షను చూపారు. మొత్తంగా ఆడియో టేపు వ్యవహారంలో ఇరుక్కున పృధ్వీరాజ్‌పై వైసీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
