వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి విరిచుకుపడ్డారు. చంద్రబాబు ప్రశాంతంగా పండుగ కూడా చేసుకోనివ్వడంలేదని అన్నారు. తన స్వార్ధం కోసం ఇలా చేయడం సరికాదని మండిపడ్డారు.”అమ్మ ఒడి కింద రూ.15 వేలు ప్రయోజనం పొందిన 43 లక్షల కుటుంబాలు సంక్రాంతి ముందే వచ్చిందని మురిసిపోతున్నాయి. ఇన్ సైడర్ భూముల కోసం చంద్రబాబు జోలె పట్టుకుని లాంగ్ మార్చ్ చేస్తుండటం అందరికీ చికాకు తెప్పిస్తోంది. పండగ కూడా ప్రశాంతంగా చేసుకోనిచ్చేలా లేడని విసుక్కుంటున్నారు” అని అన్నారు.