తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో పట్టు దారం పరిశ్రమను ఇండోరమ సింథటిక్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తెలిపారు.
సిరిసిల్ల,పోచంపల్లి,గద్వాల ,నారాయణ పేట్ ,కొత్త కోట చేనేత కార్మికులు పట్టుదారం కోసం బెంగుళూరుపై ఆధారపడుతున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటైతే కార్మికులకు దూరాభారం తగ్గుతుంది.
రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని ఆయన చెప్పారు.