తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మధిర మున్సిపాలిటీని ప్రగతి పథంలో నడిపించే సత్తా టిఆర్ఎస్ పార్టీకి ఉందని మున్సిపాలిటీలోని ప్రజలు ఆలోచించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు,జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించారని అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం జిల్లా పరిషత్ లను టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడమే కాకుండా ఖమ్మం జిల్లా పరిషత్ ను అత్యధిక మెజార్టీతో గెలుపొందిదన్నారు.
అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి పట్టం కడుతున్నారని ఈ విధంగానే మధిర మున్సిపాలిటీలోని ఓటర్లు ఆలోచించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇప్పటికే మధిర మున్సిపాలిటీని సుమారు 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, భవిష్యత్తులో మరి కొన్ని నిధులు తీసుకొచ్చి మధిర ను అభివృద్ధి పదంలో నడిపిస్తామని వారన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలోని మధిర -madipalli మధ్యలో వైరా నది పై చఫ్టను ఏర్పాటు చేస్తామని..విద్య, వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ… వృత్తిపరమైన విద్యా బోధన అందించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఈ దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ దిశానిర్దేశం తో కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేసుకుందామని వారు తెలిపారు.
అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ మధిర మున్సిపాలిటీ లోని 22 వార్డులలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని వారు పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బట్టి కి లాభo.. టిఆర్ఎస్ కి ఓటేస్తే మధిర ప్రజలకు లాభం అని వారన్నారు. అధికారంలో ఉన్న పాలకమండలిని గెలిపించుకోవాలని ఈసారి మున్సిపాలిటీలోని ఇరవై రెండు వార్డులలో విద్యా విద్యా వేత్తలను, మేధావులను పోటీలో దించమని ప్రజలు ఆలోచించి ఎవరికి ఓటు వేస్తే మధిర అభివృద్ధి జరుగుతుందో గుర్తించి ఓటు వేయాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.