తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరో ఖ్యాతి దక్కింది. ఇందులో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ లో చేపట్టిన కార్యక్రమాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన టాప్ టెన్ నగరాల్లో హైదరాబాద్ మహానగరానికి చోటు లభించింది.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు,ఉద్యోగులు,సిబ్బంది చేసిన విశేష కృషిని స్వచ్ఛ భారత్ విభాగం అభినందించింది. వీరిని మిగతా నగరాల సిబ్బంది కూడా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చింది.
సిటిజన్ ఫీడ్ బ్యాక్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మంచి ర్యాంకింగ్ వచ్చేలా గ్రేటర్ పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సూచించారు.