తెలంగాణ రాష్ట్రంలోని భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన పాల్వంచలోని కేటీపీఎస్ కు సమీప దూరంలో రేజర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని దూదియ తండా,హార్యా తండా,మాన్య తండా,సూర్యతండాలల్లో నివాసముంటున్న ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ.ఎర్రోళ్ల శ్రీనివాస్ ను శుక్రవారం బషీర్ బాగ్ లోని కమిషన్ కార్యాలయంలో కలిశారు.
కేటీపీఎస్ కు సమీపంలో ఉంటున్న తమ తండాలు కాలుష్య ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి కొత్తగూడెం ఐటీడీఏ అధికారి తమకు ఉపాధి కల్పిస్తామని హామీచ్చారు.
అయిన కానీ ఇంతవరకు దానిలో ఎలాంటి పురోగతిలేదు..మీరు ప్రత్యేక చొరవ తీసుకుని తమకు ఉపాధిని కల్పించేలా చేయాలని విన్నవించుకున్నారు..దీనికి స్పందించిన చైర్మన్ ఎర్రోళ్ల మీ సమస్యపై తగిన విచారణ చేపట్టి..సత్వరమే న్యాయం జరిగే విధంగా చూస్తానని భరోసానిచ్చారు..
Post Views: 293