టీడీపీ అధినేత చంద్రబాబుకు వయసు పెరిగిపోతున్న కొద్ది ఉన్న మతి పోతున్నట్లు ఉంది..అమరావతి రాజకీయంలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. రోడ్డుపై కూర్చోవడం, జోలెపట్టుకుని అడుక్కోవడం, చదివింపుల పూజారిలా మహిళల నుంచి గాజులు, దిద్దులు, కాళ్లపట్టీలు వసూలు చేయడం…ఇలా రాజధాని రాజకీయంలో బాబు చేష్టలు హాస్యాస్పదంగా మారుతున్నాయి. అయితే సేవ్ అమరావతి పేరుతో సాగుతున్న బాబు పర్యటనలు ఆసాంతం ఆత్మ స్థుతి, పరనిందగా సాగుతున్నాయి. హైదరాబాద్‌నే నేనే డెవలప్ చేశా తమ్ముళ్లు..ఆనాడు సైబరాబాద్ కట్టా..ఐటీ కంపెనీలను పెట్టా…అమెరికా ప్రెసిడెంట్‌లను తీసుకువచ్చా..అంటూ షరామామూలుగా తనకు తాను పొగుడుకుంటున్నారు. అదే సమయంలో ఇంకా తెలంగాణపై ఏపీ ప్రజల్లో విద్వేషాలు రగిలిస్తున్నారు.
అసలు మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా..మూడు రాజధానుల వ్యవహరానికి, తెలంగాణను తిట్టడానికి ఏమైనా సంబంధం ఉందా.. గతంలొ ఓటుకు నోటు కేసులో పట్టుబడి అర్థరాత్రి విజయవాడకు పారిపోయి…నీకు ఏసీబీ ఉంది..నాకు ఏసీబీ ఉంది..కేసీఆర్..హైదరాబాద్‌లో ఆంధ్రులకు రక్షణ లేదు..సెక్షన్ 8 అంటూ తెలంగాణపై ఏపీ ప్రజల్లో విద్వేషాలు రగిలించారు. ఓటుకు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్, జగన్, మోదీలు కలిసి ఏపీపై కుట్ర చేస్తున్నారని..ఊరూరా తిరిగి రంకెలు వేశారు. ఇప్పుడు అమరావతి రాజకీయంలో తెలంగాణపై ఆడిపోసుకోవడంలో బాబుకు అసలేమాత్రమైనా ఇంగిత జ్ఞానం ఉందా అనిపిస్తోంది. అమరావతిపై చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా ఎంతగా ప్రయత్నిస్తున్నా..అది 29 గ్రామాలకే తప్పా..రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మారడం లేదు..దీనికి కారణం వైజాగ్, కర్నూలులో రాజధానుల ఏర్పాటుకు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు సానుకూలంగా ఉండడమే. అందుకే చంద్రబాబు మరోసారి ఆంధ్రులలో సెంటిమెంట్ పేరుతో విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నారు.
సేవ్ అమరావతి పేరుతో జిల్లాలలో పర్యటిస్తున్న చంద్రబాబుపై మరోసారి తెలంగాణపై నోరుపారేసుకుంటున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన అమరావతి జేఏసీ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. మూడు రాజధానుల వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయిందని తెలంగాణ వాళ్లంతా నవ్వుకుంటున్నారంటూ ఏపీ ప్రజల్లో విద్వేషాలు రగిలిస్తున్నారు. ఏపీకి బాగా జరిగిందని..కనీసం రాజధాని కూడా నిర్మించుకోలేని అసమర్థులని తెలంగాణ వాళ్లు అనుకుంటున్నారని ఏపీ ప్రజలకు నూరిపోస్తున్నారు. అసలు అమరావతి ఆందోళనపై తెలంగాణ నాయకులు ఎవరూ బహిరంగంగా మాట్లాడింది లేదు.. మూడు రాజధానుల వ్యవహారం ఏపీకి సంబంధించినది అని తెలంగాణ నాయకులెవ్వరూ పెద్దగా మాట్లాడింది లేదు..తెలంగాణ సమాజం కూడా ఏపీ రాజధానుల వ్యవహారాన్ని ఆసక్తిగా గమనిస్తుంది. అధికార, పరిపాలనా వికేంద్రీకరణ అనే అంశం పట్ల తెలంగాణ ప్రజలే కాదు..ఎవరైనా పెద్దగా అభ్యంతరం చెప్పరు.
అయితే చంద్రబాబు మాత్రం..తన స్వార్థ రాజకీయం కోసం మరోసారి తెలంగాణపై ప్రజల్లో విద్వేషాన్ని రగిలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయిందని తెలంగాణ వాళ్లంతా నవ్వుకుంటున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు చేతనైతే అమరావతే రాజధాని అని ఏపీలోని అన్ని ప్రాంతాల ప్రజలను ఒప్పించాలి..కాని రాష్ట్రం విడిపోయి ఎవరి బతుకు వారు బతుకుతూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలుగు ప్రజల మధ్య విద్వేషాన్ని రగిలించడం బాగాలేదు. తెలంగాణ ప్రజలపై విద్వేషం రగిలించడం ద్వారా అమరావతి సెంటిమెంట్‌ను ప్రజల్లో బలంగా తీసుకువెళ్లాలన్నదే చంద్రబాబు కుయుక్తి..ఇప్పుడు మీకు అర్థమవుతుందా..బాబు ఎందుకలా అమరావతి సభల్లో ఇంకా తెలంగాణపై ఆడిపోసుకుంటున్నారో..తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతగా దిగజారుతారో మరోసారి తనకు తాను నిరూపించుకున్నారు.