అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధానిని కొనసాగించాలంటూ..మూడు వారాలుగా రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో రాజధాని రైతుల్లో మరింతగా భయాందోళనలను రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి బస్సు యాత్రలకు శ్రీకారం కూడా చేప్పట్టారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి. “చంద్రబాబు లాంటి సిగ్గు, లజ్జ లేని వ్యక్తి దేశ రాజకీయాల్లో ఎక్కడా కనిపించడు. స్పెషల్ స్టేటస్ ఉద్యమంలో పాల్గొంటే అరెస్టు చేస్తామని అప్పట్లో విద్యార్థులు, తల్లిదండ్రులకు వార్నింగులిచ్చాడు. ఇప్పుడేమో తమ ‘ఇన్ సైడర్’ పెట్టుబడులను రక్షించుకునేందుకు స్టూడెంట్సంతా రోడ్ల పైకి రావాలట”.
Home / ANDHRAPRADESH / దేశ రాజకీయాల్లో చంద్రబాబు లాంటి సిగ్గు, లజ్జ లేని వ్యక్తి ఎక్కడా కనిపించరట..!
Tags ap Chandrababu jagan politics tdp ysrcp